విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ అమలు చేయాలి
విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ అమలు చేయాలి
మణుగూరు, శోధన న్యూస్ : విద్యుత్ సంస్థల్లో ఆగస్టు 31, 2004 లోపు విధుల్లో చేరిన ఉద్యోగులందరికీ జీపీఎఫ్ అమలు చేయాలని ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సాధన కమిటీ నాయకులు కోరారు. 2004 వ సంవత్సరం లోపు విధుల్లో చేరిన విద్యుత్ ఉద్యోగులందరికీ జీపీఎఫ్ అమలు చేయాలని సాధన కమిటీ ఆధ్వర్యంలో మణుగూరు లోని బీటీపీఎస్ లో చీఫ్ ఇంజనీర్ భూక్యా బిచ్చన్న కు శనివారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశం లో ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సాధన కమిటీ నాయకులు బి.మంగీలాల్, సి. హెచ్ రాజబాబు లు ప్రసంగించారు. అన్ని ప్రభుత్వ సంస్థల్లో 2004 వ సంవత్సరం వరకు జీపీఎఫ్ అమలవుతుందని గుర్తు చేసారు. కేవలం విద్యుత్ సంస్థల్లో మాత్రమే 31,జనవరి 1999 వరకు విధుల్లో చేరిన ఉద్యోగుల వరకు జిపిఎఫ్ ను అమలు చేస్తున్నారని తెలిపారు. 2004 వ సంవత్సరాలు వరకు విధుల్లో చేరిన ఉద్యోగులందరికీ ఈ పథకం అమలు అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి. భీమ్య, కే. కోటేశ్వరరావు, పి. రవీందర్ రెడ్డి, అంబాల శ్రీనివాస్, పివి.సురేష్, వి.ప్రసాద్,యం. రాజమనోహర్, బి.సత్యనారాయణ,ఎస్కే సాదిక్, వీరస్వామి, నాగేశ్వరరావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.