Badrachalam: భద్రాచలం గోదావరి నది 51.80 అడుగులు
భద్రాచలం గోదావరి నది 51.80 అడుగులు
ఎటపాక వాగు పొంగడం వల్ల లోతట్టు ప్రాంతాలైన కొత్త కాలనీ లోని 36 కుటుంబాలను భద్రాచలం నన్నపనేని హై స్కూల్ లోని పునరావాస కేంద్రంలో తరలించారు.ఎటపాక వాగు బ్యాక్ వాటర్ ను ఇరిగేషన్ అధికారులు 90 హెచ్పి ఆరు మోటార్ల ద్వారా ఎత్తిపోసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండు మోటర్లు పాడయినాయి.
నాలుగు మోటర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. రిపేరు గురైన మోటార్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేస్తున్నారు. రిపేరు అయిన వెంటనే మొత్తం ఆరు మోటర్లు 24 గంటలు వరద నీటిని ఎత్తిపోస్తాయి.వరద నీరు భారీగా రావడం వల్ల బ్యాక్ వాటర్ ను పంపుల ద్వారా గోదావరి లోకి పంపడం కష్టతరమవుతుంది.గోదావరి వరద తగ్గే అవకాశం ఉన్నందున, వరద నీటిమట్టం తగ్గాక పూర్తిస్థాయిలో నీరు ఎత్తిపోయడం జరుగుతుంది.కొంతమంది వ్యక్తులు పంపులు నడపకపోవడం వల్ల ప్రజల నివాస స్థలాల్లోకి నీరు వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వారికి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని జిల్లా కలెక్టర్ జితేష్ హెచ్చరించారు. సంఘటన స్థలంలో భద్రాచలం ఆర్డీవో, మరియు పోలీసు సిబ్బంది, పూర్తిస్థాయి పర్యవేక్షిస్తున్నర ని తెలిపారు.