విద్యార్థులలో మానవీయ విలువలను పెంపొందించాలి
విద్యార్థులలో మానవీయ విలువలను పెంపొందించాలి
– మణుగూరు సీఐ సతీష్ కుమార్
మణుగూరు, శోధన న్యూస్ : టీచర్లు, విద్యార్థులలో మానవీయ విలువలు, సమాజంలో ఇతరుల పట్ల ఎలా మెలగాలో ., వంటి సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సిఐ సతీష్ కుమార్ సూచించారు. లయన్స్ క్లబ్ మణుగూరు రెండు రోజుల టీచర్ల ట్రైనింగ్ ప్రోగ్రాం క్వెస్ట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని అన్నారు. విద్యార్థులలో సామాజిక అంశాలపై అవగాహన పెంచుటకు, విద్యార్థుల జీవన నైపుణ్యాలపై టీచర్లకు శిక్షణను ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. లయన్స్ క్లబ్ సమాజసేవ తో పాటు సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం ఎందరికో స్ఫూర్తిదాయకం అన్నారు. టీచర్లు సమాజ నిర్మాతలని, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో వారి కృషి ఎంతో ఉందన్నారు అనంతరం 30 మంది టీచర్లకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ప్రతిభ చూపిన టీచర్లకు ప్రత్యేక బహుమతులు, టీచర్లందరికీ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి ట్రైనర్ గా కొండపల్లి రేణుక వ్యవహరించగా . ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మణుగూరుప్రెసిడెంట్, నల్లగట్ల సత్య ప్రకాష్ సెక్రటరీ షేక్ మీరా హుస్సేన్ చార్టర్ ప్రెసిడెంట్ పిల్లర్ శెట్టి హరిబాబు, సభ్యులు గాజుల పూర్ణచంద్రరావు గాజుల రమేష్, కముజు చంద్రమోహన్ బేతంచెర్ల వెంకటేశ్వర్లు, మత్తం శెట్టి నాగేశ్వరరావు, ఆడవాళ్ళ నాగేశ్వరరావు, చింతపల్లి రాంబాబు, భూక్య ప్రసాద్, భూక్యతార, మరియు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల టీచర్లు పాల్గొన్నారు.