తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి…
తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి…
- కేంద్రం బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాట ఆపాలి
- సిపిఎం సింగరేణి పరిరక్షణ యాత్రను జయప్రదం చేయాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణలో బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వ బొగ్గు గనుల వేలంపాట ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక శ్రామిక భవనంలో సిపిఎం సింగరేణి పరిరక్షణ యాత్ర పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు మూడో తేదీన సిపిఎం సింగరేణి పరిరక్షణ యాత్ర మణుగూరులో ప్రవేశిస్తుందన్నారు. బొగ్గు గనులలోని వివిధ పని ప్రదేశాలలో యాత్ర నాయకులు పర్యటిస్తారని తెలిపారు మూడు గంటలకు అంబేద్కర్ సెంటర్ లో బహిరంగ సభ ఉంటుందన్నారు సింగరేణి పరిరక్షించుకోవడం కోసం అధిక సంఖ్యలో మణుగూరు సబ్ డివిజన్ లో నీ ప్రజలందరూ పాల్గొనాలనిపించారు 4,5వ తేదీలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ఇల్లందు సత్తుపల్లి లో బస్సు యాత్ర ఉంటుందన్నారు 5న మూడు గంటలకు కొత్తగూడెంలో ముగింపు సభ జరుగుతుందని ఆయన తెలిపారు ముగింపు సభకు అధిక సంఖ్యలో కార్మికులు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు . సింగరేణి సంస్థను నీరుగార్చి, దానిని దెబ్బతీసేలా బొగ్గు బ్లాకులను వేలం పాటను నిర్వహిస్తుందని విమర్శించారు ప్రైవేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులను కేటాయిస్తే సింగరేణి నిర్వీర్యం అవుతుందన్నారు. శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను నేరుగా సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనుల నమ్ముకొని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రాంతంలో స్థిరపడి జీవనం కొనసాగిస్తున్నారు సింగరేణి వేలంపాట ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పచెపితే ఈ ప్రాంతం నిర్వీర్యం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాక్ ల వేలం పాటను ఆడుకునేందుకు సిపిఎం సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. జులై 29న బెల్లంపల్లిలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభిస్తారని అన్నారు ఈ యాత్రకు రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్ పి ఆశయ ఈ నాయకత్వంలో బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు ఆగస్టు 5న కొత్తగూడెంలో ముగింపు సభ ఉంటుందని తెలిపారు బొగ్గు గనులకు కేంద్రాలైన మణుగూరు ఇల్లందు కొత్తగూడెం నుంచి అధిక సంఖ్యలో కార్మికులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ వలన ప్రజల ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటారని అన్నారు. బొగ్గు బ్లాక్ ప్రైవేటీకరణ వలన ప్రవేటు సంస్థలు లాభపడతాయని, ప్రజలు ఆర్థికంగా దెబ్బతింటారని అన్నారు. అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ప్రైవేట్ పరం అవుతుందని, కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాట చరిత్ర ఉన్న తెలంగాణ ప్రజలు కార్మికులు కల్లెర్ర చేసి సింగరేణి కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొడిశాల రాములు కార్యదర్శివర్గ సభ్యులు దామల్ల లెనిన్ బాబు సిఐటియు జిల్లా నాయకులు సత్ర పల్లి సాంబశివరావు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వల్లూరి వెంకటరత్నం మున్సిపాలిటీ నాయకులు పల్లపు నాగేశ్వరరావు గిరిజన సంఘం మండల అధ్యక్షురాలు కోండ్రుగౌరీ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొల్లం రాజు మధ్యాహ్న భోజనం కార్మికుల సంఘం అధ్యక్షురాలు శైలజ ,వెంకన్న సదానందం ములకల ఉత్తమ్ గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు రంగా తదితరులు పాల్గొన్నారు.