తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపు పై  అసెంబ్లీలో చర్చించాలి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపు పై  అసెంబ్లీలో చర్చించాలి

– పినపాక ఎమ్మెల్యే  పాయంకి వినతి 
 

మణుగూరు, శోధన న్యూస్ : వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపు సంక్షేమానికి సంబంధించి శాసన సభ దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఇఫ్టూ ఆధ్వర్యంలో సోమవారం  హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి వినతి పత్రం అందజేసినట్లు ఐ ఎఫ్ టి యు అనుబంధం గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన సమస్య వేతన పెంపు, సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని అన్నారు.  సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాల అమలు లేదా రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ 22 ఏదో ఒకటి అమలు చేసి వారి జీతాల పెంపుకు చర్యలు చేపడితే తద్వారా వారి జీవితాలు బాగుపడతాయని అన్నారు.   ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని, సింగరేణి సి ఎం డి ఎన్ బలరాం తో కూడా మాట్లాడాలని కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగే అన్ని విధాల ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ని కోరినట్లు ఆయన తెలిపారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *