Cause : ఇబ్బందులు కలిగించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
ఇబ్బందులు కలిగించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.
రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా.
పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.బ్లూ కోల్ట్స్,పెట్రోలింగ్ వాహనాలతో నిత్యం రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం సిబ్బంది సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,టూటౌన్ సీఐ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.