Farmers : రైతులు రుణమాఫీ తో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.
రైతులు రుణమాఫీ తో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా రెండో విడత రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐ డి ఓ సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన రైతు వేదికలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. మొదటగా హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమలులో భాగంగా ఈరోజు రెండో విడత నిధుల విడుదల లో భాగంగా 1,50,000 లోపు రుణాలు ఉన్న రైతులు అందరికీ తమ ఖాతాల్లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో రెండో విడత రైతు రుణమాఫీ లో భాగంగా16377 మంది లబ్ధిదారుల కు గాను 137,21,96,477 రూపాయలు ఈ రోజు రైతుల ఖాతా ల లో జమ చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు తమ ఇల్లు మరియు పొలాలలో నీటి కుంటలు ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఆ నీటి కుంటల్లో ప్రభుత్వం తరఫున ఉచితంగా అజోల్ల నాచు పెంపకం చేపట్టమన్నారు. నీటి కుంటలో కొర్రమీను చేపలు పెంపకం ప్రయోగత్మకంగా చేపట్టాలన్నారు. దీని ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు.రైతులు పశు సంపద సంరక్షణలో భాగంగా పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకోవాలని, ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన పశువుల కొట్టాలకు తిరిగి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు.