BSNL : మొదటిస్థానంలో ఉన్న బి.ఎస్.ఎన్.ఎల్
మొదటిస్థానంలో ఉన్న బి.ఎస్.ఎన్.ఎల్
దేశంలో ప్రభుత్వ రంగ సoస్థల్లో ఒక వెలుగు వెలిగి..మొదటిస్థానంలో ఉన్న బి.ఎస్.ఎన్.ఎల్ తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటుదని బి.ఎస్.ఎన్.ఎల్ ఎంజీఎం జి.సుభాష్ ఆశాభావం వ్యక్తం చేశారు.టెలికాం రంగంలోనే రారాజుగా కొనసాగి.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ రంగానికి ధీటుగా వినియోగదారులకు సేవలు అందిస్తూoదన్నారు.
ఇటీవల ప్రైవేట్ రంగంలోని వివిధ రకాల నెట్వర్క్ సంస్థలు తమ టారీఫ్ ప్లాన్స్ ను అమాంతం పెంచడంతో వినియోగదారుల చూపులు మరోసారి బి.ఎస్.ఎన్.ఎల్ వైపు వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే అన్నీ కంపెనీల కష్టమర్ దేవుళ్లను అక్షరించేలా బి.ఎస్.ఎన్.ఎల్ ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం ప్రారంభించిందని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఇతర కంపెనీలతో పోల్చుకుంటే బి.ఎస్.ఎన్.ఎల్ ట్రారీఫ్ ధర పర్వాలేదనేలా ఉన్నాయని వినియోగదారులు తెలుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.పూర్తిస్థాయిలో సిగ్నల్స్,ఇంటర్నెట్ స్పీడ్,సర్వీస్ లు అందుబాటులో ఉండడం వినియోగదారులకు కలిసివచ్చే అంశంగా ఉందని అభిప్రాయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.గత నెలరోజుల నుంచి భద్రాద్రి జిల్లాలో ఫ్రీ సిమ్ మేళా నిర్వహిస్తున్నామని దానికి అపూర్వ స్పందన లబిస్తుదన్నారు.