Collector : పంటను పండిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు.
పంటను పండిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ మైలారం గ్రామంలో మునగ ప్లాంటేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా మునగ పంటను వేస్తున్న వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందుతాయని తెలిపారు. రైతులు ఒక పంట మీదనే ఆధారపడకుండా సీజన్ వారీగా పంటను పండిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని ఆయన తెలిపారు.
మొక్కకు మొక్కకు మధ్యసరైన దూరము మరియు ఒక పెద్ద మొక్క తదుపరి ఒక చిన్న మొక్క ఉండే విధంగా ప్లాంటేషన్ చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే బుధవారం ఉదయం 6:30 గంటలకు గ్రామంలోని యువకులతో పాటు నేను కూడా వస్తాను అందరం కలిసి నాటిన మొక్కలకు పాదులు చేద్దాం అని తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఒక నీటి కుంట ఏర్పాటు చేసి అజోల్లా పంపకం చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవిపల్లి, ఎంపీ ఓ, అసిస్టెంట్ ఇంజనీర్, ఏపీవో ఈజీఎస్, గ్రామపంచాయతీ సెక్రటరీ, గ్రామపంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.