Development : గ్రామాల అభివృద్ధి మన అందరి బాధ్యత .
గ్రామాల అభివృద్ధి మన అందరి బాధ్యత .
జిల్లా కలెక్టర్ జితేష్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛధనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఆగస్టు 5 నుండి 9 వరకు 5 రోజులు పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల అభివృద్ధి పరచడం కోసమే అని గ్రామాల అభివృద్ధి మన అందరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యం తాగునీరు, ఇంకుడు గుంతలు, మొక్కలు నాటడం, రోడ్లపై గుంటలు పూడ్చటం తదితర కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. దీనిలో భాగంగా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, పార్కులు, వైకుంఠధామాలు మరియు క్రీడా ప్రాంగణాలలో పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రపరచాలని తెలిపారు.
అన్ని గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులు పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. స్వచ్ఛ ధనం – పచ్చదనం విజయవంతం కావడానికి ప్రజల్లో అవగాహన కోసం ర్యాలీలు, పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు, ఆరోగ్యమే మహాభాగ్యం, నీరు మీరు వంటి ఆకర్షణీయమైన స్లొగన్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయం పరిశుభ్రత అందరి బాధ్యత అని అందరూ శ్రమదానం చేయాలని తెలిపారు.
శిధిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించాలని ఆయన తెలిపారు. గ్రామాల్లో కుక్కల నియంత్రణకు సరైన ప్రణాళిక రూపొందించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఔషధ మొక్కలైనా నల్ల ఉసిరి, రణపాల, తిప్పతీగ,తులసితదితర మొక్కలనుతప్పకుండా నాటాలని ఆదేశించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయు విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.ప్రతి మండలంలోని ప్రధాన రహదారుల లో ఏర్పడిన గుంటలను గుర్తించి వాటిని పూడ్చాలని అధికారులను ఆదేశించారు.