Collector : ఇంటింటా ఇన్నోవేటర్ గడవు పొడిగింపు .
ఇంటింటా ఇన్నోవేటర్ గడవు పొడిగింపు .
ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలను దరఖాస్తు చేయుటకు ఈ నెల 10వ తేదీ వరకు గడవు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ తెలిపారు. గడువు పొడిగింపుపై శుక్రవారం కలెక్టర్ ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నెల 3 వతేది వరకు ఉన్న గడువును 10వ తేదీ వరకు పొడిగించిందినట్లు చెప్పారు. ఇంటింటా ఇన్నోవేషన్ లో వినూత్న ఆవిష్కరణలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఔత్సాహికులు ఆవిష్కరణలలో తమ ప్రతిభను చాటుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు ఏళ్లుగా ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు ఆవిష్కరణల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, వ్యవసాయ రంగ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలు తదితర అంశాలు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. ప్రదర్శన యొక్క అవిష్కరణపై రెండు నిమిషాల నిడివి గల వీడియో, ఆవిష్కరణ నాలుగు ఫోటోలు, ఆరు వాక్యాలతో ఆసక్తి గల ఔత్సాహికులు 9100678543నెంబర్‌కు వాట్సప్ ద్వారా వృత్తి, ఊరి పేరు, జిల్లా పేరుతో వివరాలనుపంపించాలన్నారు. అన్నిశాఖల అధికారులు ఆయా శాఖల పరిధిలో దరఖాస్తు చేయుటపై సమాచారం క్షేత్రస్థాయి వరకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.