తెలంగాణబూర్గంపాడుభద్రాద్రి కొత్తగూడెం

భారీగా గంజాయి పట్టివేత

వాహనాల తనిఖీలో భారీగా గంజాయి పట్టివేత

  బూర్గంపాడు, శోధన న్యూస్ : బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద వాహనాల తనిఖీలో భారీగా గంజాయి పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పోలీస్ స్టేషన్ లో   పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్  విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని సారపాక పుష్కర వనం వద్ద శుక్రవారం ఉదయం 7గంటలకు బూర్గంపాడు ఎస్ఐ ఈ రాజేష్, తన స్టేషన్ సిబ్బంది, జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు కే సుమన్, జే ప్రవీణ్, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి విశ్వసనీయ సమాచారం మేరకు సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. ఈ తనిఖీ చేస్తున్న క్రమంలో ఇన్నోవా ఏపీ26బీఆర్ 7003, జెస్ట్ టీఎస్ 04 ఈసీ97403, డిజైర్ టీఎస్ 28 జే 8305గల కారల్లో భద్రాచలం వైపు నుండి మణుగూరు ఎక్స్ రోడ్ వైపునకు వస్తూ ఉండగా పోలీస్లను చూసి ఆ కార్లను ఒక్కసారిగా ఆపి తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనబడగా వాటిని పోలీసులు ఆపి పట్టుకొని తనిఖీ చేయగా రెండు కార్లలోని వెనుక డిక్కీలో బ్రౌన్ కలర్తో చుట్టి ఉన్న నిషేధిత గంజాయి ప్యాకెట్లను పట్టుకోవడం జరిగిందన్నారు. వెంటనే ఆ కార్లలో ఉన్న ఆరుగురు వ్యక్తులను పట్టుకొని విచారణ చేయగా వారి పేర్లు కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన కాదతనోత్ హర్షిత్ అంబేద్కర్ గా, కిషన్ కుమార్ దాస్ హైదరాబాద్లోని గంగబోడి, మంగలహట్గా, భూక్య దేవేందర్ జనగాం జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామంగా, రావులపల్లి ప్రతాప్ బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామం గాంధీనగర్ , ములగాడ అన్వేష్ బూర్గంపాడు మండలంలోని తాళ్ళగోమ్మూరు గ్రామంగా, బాచికాడి శ్రీనివాస్ హైదరాబాద్లోని బంజారాహీల్స్ రోడ్ నెంబర్ 12గా గుర్తించడం జరిగిందన్నారు.

పట్టుబడిన కార్లలో మారుతీ డిజైర్ కారు ముందు పైలట్ వెహికల్గా ఉందని, మరో రెండు కార్లలో గంజాయి తరలిస్తూ పట్టుపడటం జరిగిందన్నారు. వీరితో కలిసి వ్యాపారం చేసే ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డి, సారపాకకు చెందిన వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డి సీలేరు ప్రాంత నందు గంజాయి కిల్లో మోహన్, పోటెరు మోహన్ రావు, రామారావుల ద్వారా సేకరించి హైదరాబాద్ నందు గల మహేందర్ సింగ్ అనే వ్యక్తికి గంజాయి ఇవ్వడం కోసం వెళ్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. గత కొంత కాలంగా చింతూరు, డొంకరాయి, సీలేరు ప్రాంత నుండి గంజాయిని సేకరించి హైదరాబాద్, వివిధ రాష్ట్రాలలో అమ్ముతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని అన్నారు. వీరికి గంజాయి రవాణ లో కారును ఏర్పాటు చేసిన జనగామకు చెందిన లతీఫ్ గా ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన ఆరుగురు వ్యక్తులు, పరారీలో మరో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి జూడిషీయల్ రిమాండ్ నిమిత్తం కోర్ట్కు పంపించడం జరుగుతుందన్నారు.

ఈ నేరంలో భాగస్వాములుగా ఉన్న ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డి, మహేందర్ సింగ్, కిల్లో మోహన్, పోటెరు మోహన్ రావు, రామారావు, లతీఫ్లు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న శివశంకర్ రెడ్డిపై సుమారు 10 కేసులు ఉన్నట్లు తేలిందన్నారు. పట్టుబడిన నిందితులలో కిషన్ కుమార్ దాస్ పై రెండు గంజాయి కేసులు, కాదతనోజ్ హర్షిత్, మునగాడ అన్వేష్ ల పై చెరొక గంజాయి కేసు నమోదు అయిందన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 80లక్షలకు వరకు ఉంటుందన్నారు. వారి వద్ద నుండి 7 సెల్ఫోన్లు, క్యాస్ రూ 8300స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్న ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ సత్యనారాయణ, ఎస్సైలు ,ప్రవీణ్ సుమన్ లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, పాల్వంచ డి.ఎస్.పి సతీష్ , పాల్వంచ సీఐ వినయ్ కుమార్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ఎస్ఐ ఈ రాజేష్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు సుమన్, జే ప్రవీణ్, బూర్గంపాడు అదనపు ఎస్ఐ నాగభిక్షం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *