Collector : సిమెంట్ ఒరలు పరిశీలించిన కలెక్టర్ జితేష్.
సిమెంట్ ఒరలు పరిశీలించిన కలెక్టర్ జితేష్.
ఈనెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మరియు వర్షాలు భారీగా కురుస్తున్నందున రోడ్ల వెంబడి గ్రామాలలో రోడ్లు వెంబడి నీళ్లు గుంటలు ఏర్పడి నీళ్లు ఎటు వెళ్ళని పరిస్థితిలో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడకుండా గ్రామ పంచాయతీలు మునిసిపాలిటీలలో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంట వర్షపు నీటిని ఒడిసిపట్టు ఇంకుడు గుంటల నిర్మాణాల కొరకు సిమెంట్ ఒరలు తయారీ షాపు చుంచుపల్లి మండలంలోని నందాతండా వద్ద ఉన్న షాపునకు కలెక్టర్ స్వయంగా వచ్చి ఒక ఒర రేటు ఎంత అని, దానిపై మూత విలువ ఎంత అని మరియు కలెక్టర్ కొన్ని మార్పులు చేర్పులు చెప్పి ఒకటి మోడల్ గా తయారు చేసి ఇవ్వవలసినదిగా కోరారు. కార్యక్రమంలో వీరి వెంట విద్యా చందన డిఆర్డిఓ ఏసిఎల్బి, తాసిల్దార్ చుంచుపల్లి పానెం కృష్ణ, ఎంపీడీవో విడివి అశోక్ కుమార్, ఎం పి ఓ గుంటి సత్యనారాయణ, ఏపీవో ఈజీఎస్ ఎమ్ రఘుపతి, ఈసీ పిల్లి నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు కే సత్యనారాయణ బి భూమిక, గ్రామపంచాయతీ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.