SBI:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-వన మహోత్సవం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – వన మహోత్సవం
సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలలో మొక్కలు పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చు నని, మనం మొక్కను రక్షిస్తే అది మనను, మన కుటుంబాన్నీ రక్షిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు.
మనం మొక్కను రక్షిస్తే అది మనను, మన కుటుంబాన్నీ రక్షిస్తుంది.
బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు తాము పనిచేస్తున్న శాఖల్లో , తమ ఇండ్లలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆయన సూచించారు. తమ పిల్లలకు మొక్కల పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ బ్యాంక్ అన్ని శాఖలు వన మహోత్సవ కార్యక్రమంలో పలుపంచుకుంటాయని ఆయన వివరించారు. మన కుటుంబాన్నీ రక్షిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు.
ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్, శ్రీనివాస రావు,అబ్దుల్ ఇజాజ్ హమీద్ ఖాన్ , రీజినల్ ఆఫిస్ అధికారులు, సిబ్బంది, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి పాల్గొన్నారు.