తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరం
తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరం
మణుగూరు, శోధన న్యూస్ : తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరం అని మణుగూరు ఐసిడిఎస్ సిడిపిఓ పి జయలక్ష్మి తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం సెక్టార్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ అంగన్ వాడి కేంద్రంలో అంగన్ వాడి టీచర్ లీలావతి ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి హాజరైన సిడిపిఓ జయలక్ష్మీ మాట్లాడుతూ……ఆగస్టు ఒకటో తారీకు నుంచి 8 వ తారీకు వరకు జరుగు తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయన్నారు. బాలింతలు తల్లిపాలకు అధిక ప్రాధాన్యత నివ్వాలని, తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని అన్నారు, తల్లిపాలు బిడ్డలకు పట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని, తల్లిపాలు బిడ్డలు తాగడం వల్ల పిల్లల మేధాశక్తి పెరిగి మంచి దృఢంగా కలిగి ఉంటారని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని వారికి చక్కటి ఆలోచన విధానాన్ని కలిగి, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మంచి ఆలోచనలతో కలిగి ఉండాలంటే తల్లిపాలు బిడ్డలకు ఎంతో శ్రేష్టకరమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు,ఎన్టీఆర్ నగర్ స్కూల్ హెడ్మాస్టర్ అరుణ, ఉపాధ్యాయురాలు శ్రీదేవి, ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్త కంగాల విజయకుమారి, గర్భనిలు తల్లులు పుణెం శిరీష,అమ్రేనా,,తొలెం దుర్గప్రసన్న, ఎండి రజియా,దివ్య, జహీర, తదితరులు పాల్గొన్నారు.