తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

జాబ్ క్యాలండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 

జాబ్ క్యాలండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 

మణుగూరు, శోధన న్యూస్ : జాబ్ క్యాలండర్ పేరుతో  కాంగ్రెస్ ప్రభుత్వం  నిరుద్యోగులను మోసం చేస్తోందని బిఆర్ఎస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం సృజన్  ఆరోపించారు. భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు పట్టణం లోని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో ఎక్కడ స్పష్టత లేదని,కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో 2025 – 2029 వరకు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల పూర్తి వివరాలు లేవని అన్నారు. ఇది నిరుద్యోగులను మోసం చేసే జాబ్ క్యాలెండర్ అని, జాబ్ క్యాలెండర్ అనేది నిరంతర ప్రక్రియ అంటూ నిరుద్యోగులను మాయమాటలతో  కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు.  త్వరితగతిన కాంగ్రెస్  ప్రభుత్వం  నిరుద్యోగులు అందరికీ న్యాయం జరిగేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని, సంబంధిత శాఖలలో ఖాళీల వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ  సమావేశం లో బిఆర్ఎస్ యువజన నాయకులు జక్కం రంజిత్, తాళ్లపల్లి నాగరాజు, డేగల సంపత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *