తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం ఆపాలి…

కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం ఆపాలి…

  • తెలంగాణ బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి…
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య
  •   మణుగూరు కు చేరుకున్న సిపిఎంసింగరేణి పరిరక్షణ   యాత్ర

మణుగూరు, శోధన న్యూస్ : కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం ఆపాలని,  సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం దారుణమని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర సందర్భంగా మణుగూరులోని సింగరేణి ఓసీ-2,కేసిహెచ్పి, కేపీయూజీ, ఓసి 4 గనులలో  బస్సు యాత్ర బృందం పర్యటించి ఆయా ప్రాంతాల్లో సింగరేణి పరిరక్షణకై బస్సు యాత్ర బృందం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య,మందడపు సాయిబాబా,బోపాలు,ఆశయ్య,మంద నరసింహారావు లు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా బొగ్గు గనులను వేలం వేస్తుందని, ఇది కార్మికుల కుటుంబాలను బజారుపాలు చేయడమే అవుతుందని వారు ఆరోపించారు. దేశ సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ విధానాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలన్నారు.  సింగరేణి బొగ్గు బ్లాకుల సాధన కోసం 2004 జూలై 29 నుండి ఆగస్టు 5 వరకు సింగరేణి పరిరక్షణకై యాత్ర కొనసాగుతుందని తెలిపారు. బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ అని పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో సింగరేణి సంస్థ సొంత ఖర్చులతో అనేక ప్రాంతాలలో సర్వే చేసి బొగ్గు బ్లాకులను గుర్తించి బొగ్గు ఉత్పత్తి చేస్తుందని అన్నారు.

శ్రావణపల్లిలో కూడా సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలు చేపట్టాలి.కానీ వేలంపాట ద్వారా దక్కించుకోవాలని బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు.గతంలో బిఆర్ఎస్ పాలనలో మోడీ ప్రభుత్వం ప్రవేటు సంస్థలకు అప్పగించిందని బొగ్గు బ్లాక్ లన్ని ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత రానున్న కాలంలో సింగరేణి బలహీన పడి మూతపడే పరిస్థితి ఉందని ఆరోపించారు.దీని వలన సింగరేణి ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని వాపోయారు.సింగరేణి కార్మికులు నిత్యం గనుల్లో బలిదానాలు చేస్తున్నారని,75 వేల మంది పర్మినెంట్,కాంట్రాక్టు కార్మికులు,ఉద్యోగులు నిరంతర శ్రమ అధికారుల కృషితో సింగరేణి లాభాల బాటలో ఉందని వారు పేర్కొన్నారు.సింగరేణి జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాలలో విద్య,వైద్యం రోడ్లు,మంచినీరు ఇతర మౌలిక సదుపాయాల కోసం వేలకోట్లు నిధులు ఖర్చు పెడుతుందని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు, పన్నుల రూపంలో ప్రతి సంవత్సరం వేల కోట్లు చెల్లిస్తుందని,కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సింగరేణి సుమారు 49 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుందని వారు పేర్కొన్నారు.మన రాష్ట్ర ప్రభుత్వం 30 వేల కోట్లు సింగరేణికి బకాయిపడి ఉందని ఇంత చేసిన కార్మికుల శ్రమతో ప్రతి సంవత్సరం 2-3 వేల కోట్ల లాభాల్లో సింగరేణి ఉందని వారన్నారు. బంగారు గుడ్లు పెడుతున్న బాతులాంటి సింగరేణిని కార్పొరేట్లకు కట్టబెట్టడం దారుణమని వారు మండిపడ్డారు.

గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి 8 మంది ఎంపీలు గెలిపించిన రాష్ట్ర ప్రజలకు వారు చేసింది శూన్యమేనని,సింగరేణి బ్లాక్ గనుల ప్రైవేటుకరణకు నోరు మెదపడం లేదని వారన్నారు.బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమితులైన కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రారంభించడం సిగ్గుచేటని బిజెపి నాయకత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుందని మండిపడ్డారు.కేంద్ర బిజెపి చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వేలంపాట ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొనడం ఆందోళనకరమని మండిపడ్డారు.బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో పోరాడకుండా సింగరేణికి గనులు దక్కకుండా చేస్తుందని అన్నారు.కోయగూడెం బ్లాక్ 3,సత్తుపల్లి బ్లాక్ 3 లను ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయని వారన్నారు.తక్షణమే తెలంగాణ కార్మిక బిడ్డలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని, గతంలో రెండు బ్లాకులను తక్షణమే తిరిగి సింగరేణికి అప్పగించాలని,కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్షాన్ని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు,సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్,అన్నవరపు కనకయ్య,సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి వల్లూరు వెంకటరత్నం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు,సిఐటియు నాయకులు సత్రపల్లి సాంబశివరావు,మాచారపు లక్ష్మణరావు,నందం ఈశ్వరరావు,టివిఎంవి ప్రసాద్,సిపిఎం మండల కార్యదర్శి కొడిశాల రాములు,ఉప్పతల నరసింహారావు,రామ్మూర్తి,నల్లెల విల్సన్,లక్ష్మణరావు,బొల్లం రాజు,పిట్టల నాగమణి,తోట పద్మ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *