తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

ప్రధాన రహదారి పై  గుంతలు వెంటనే పూడ్చాలి

ప్రధాన రహదారి పై  గుంతలు వెంటనే పూడ్చాలి

 – హై లెవెల్ బ్రిడ్జి రోడ్డు ను వెంటనే ప్రారంభించాలి 

 మణుగూరు, శోధన న్యూస్ :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు-ఏటూరునాగారం రహదారి  బి టి పి ఎస్  కు వెళ్లే రహదారి పై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని సిపిఐ   మండల ,పట్టణ కార్యదర్శులు జంగం మోహన్ రావు , దుర్గ్యాల  సుధాకర్ లు డిమాండ్ చేశారు. రహదారి  గుంతల మయమై ప్రయాణికులకు, వాహనదారులకు ,ఇబ్బందికరంగా మారిందని, రోజుకు కొన్ని వందల వాహానాలు ఈ రహదారి గుండా ప్రయాణిస్తుంటాయని , ఆ రోడ్డు గురించి పట్టించుకునే వారే లేరని, అన్నారు.  అనేకమంది కిందపడి కాళ్లు చేతులు విరిగాయని ఇంత జరుగుతున్న ఆర్ అండ్ బి శాఖ అధికారులు . కనీసం తాత్కాలిక మరమ్మతులైన చేయడం లేదన్నారు.

ఒకవైపు బీటిపీఎస్ కు వెళ్లే రహదారి (రైలు మార్గాo) కు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభమై సంవత్సరం గడుస్తున్న నేటికీ ఆ బ్రిడ్జి పనులు పూర్తి కాలేదని ,సెంట్రింగ్ తీసేసి రెండు నెలలు గడుస్తున్న కనీసం ఆ రహదారిని ప్రారంభించలేదని , పినపాక వరంగల్ ప్రయాణం కు ఈ రహదారి మీధ నుండి నిత్యం బస్సులు ,లారీలు, ఇతర వాహనాలు తిరుగుతున్నాయని ,ఈ రహదారి ప్రారంభించకపోవడం వలన సింగిల్ రోడ్డు గా అనేకమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, ఎందుకు దీనిని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని ,ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి వెంటనే పనులు ప్రారంభించి ,రహదారి కొనసాగేలా చర్యలు చేపట్టాలని లేకుంటే సిపిఐ పార్టీ ద్వారా ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎస్ కే సర్వర్, గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సోందే కుటుంబరావు ,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ ఎడారి రమేష్, రైతు సంఘం జిల్లా నాయకులు మంగి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *