పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వరం
పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వరం
- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
- కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణి
మణుగూరు, శోధన న్యూస్: పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వరం అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరు పేద కుటుంబాలకు చెందిన ఆడపడుచులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చేతుల మెదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు ఒక కోటి 20 లక్షల విలువ గల కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని అన్నారు . మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం నెరవేరిందని అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డును 10 లక్షల కి పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం కి దక్కుతుందని అన్నారు. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సాధ్యమైందని కొనియాడారు. 200 యూనిట్లు విద్యుత్క పేదలకు ఉచితకంగా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడిఓ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుదు పీరినాకి నవీన్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.