మణుగూరు ఏరియా ఫిట్టర్ బదిలీలను నిలుపుదల చేయాలని వినతి
మణుగూరు ఏరియా ఫిట్టర్ బదిలీలను నిలుపుదల చేయాలని వినతి
మణుగూరు, శోధన న్యూస్ : అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ కింద మణుగూరు ఏరియా లో పని చేస్తున్న 15 మంది ఫిట్టర్ లను సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా కు బదిలీ చేయడం జరిగిందని, బదిలీలను నిలుపుదల చేయాలని కోరుతూ టిబిజికె యస్ నాయకులు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిబిజికేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాగెల్లి మాట్లాడుతూ .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో ఫిట్టర్ అవసరాలు ఉన్నప్పటికీ కార్పొరేట్ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం వల్ల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏరియా లో సర్ఫేస్ ఫిట్టర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని యాజమాన్యం భర్తీ చేయకుండా బదిలీలు చేపట్టడం జరిగిందన్నారు. సింగరేణి యాజమాన్యం తో మాట్లాడి బదిలీలను నిలుపుదల చేసి ఏరియాలో సర్ఫేస్ ఫిట్టర్ ఖాళీలు భర్తీ చేపించే విదంగా చొరవ చూపాలని ఆయన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు యాజమాన్యం తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చినట్టు అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బంగారి పవన్ కుమార్, మునిగెల నాగేశ్వర రావు పాల్గొన్నారు.