Farmers: రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
టేకులపల్లి మండలం సులానగర్ గ్రామం లోని ధరావత్ హార్జా అనే రైతు వేసిన మునగ సాగును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా మునగ పంటను వేస్తున్న వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు,సబ్సిడీ లు అందుతాయని అదేవిధంగా పంట చేనులో ఫారం పాండ్లు ఎనర్జీఎస్ ద్వారా తీయించడం జరుగుతుందని ఈ ఫారం పాండ్లలో రైతు చేపల పెంపకం చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఎకరం సాగు భూమిలో ప్రధాన పండగ పత్తిని సాగు చేస్తూ అంతర పంటగా 1000 మునగ మొక్కలను నాటి సాగు చేస్తున్న రైతును కలెక్టర్ అభినందించారు. రైతులు ఒక పంట మీదనే ఆధారపడకుండా ఇదేవిధంగా అంతర్ పంటల ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చందవచ్చని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ పొలంలో మొక్కను నాటారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యా చందన తదితరులు పాల్గొన్నారు.