సింగరేణి వృత్తి విద్యా శిక్షణతో మహిళలు ఆర్ధికంగా ఎదగాలి
సింగరేణి వృత్తి విద్యా శిక్షణతో మహిళలు ఆర్ధికంగా ఎదగాలి
- మణుగూరు ఏరియా సేవ అద్యక్షురాలు దుర్గం సుమతి రామచందర్
మణుగూరు, శోధన న్యూస్ : సింగరేణి వృత్తి విద్యా శిక్షణతో మహిళలు ఆర్ధికంగా ఎదగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సేవ అద్యక్షురాలు దుర్గం సుమతి రామచందర్ అన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మణుగూరు ఏరియాలో టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్ కోర్సులలో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న ఐదు బ్యాచ్ లకు చెందిన 69 మహిళలకు మణుగురు ఏరియా పివి కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఖాదీ గ్రామోద్యోగ, హైదరాబాద్ వారిచే వ్రాత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మణుగూరు ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు దుర్గం సుమతి రామచందర్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ… సింగరేణి ఉద్యోగులందరి సంక్షేమంతో పాటు సింగరేణి ఉద్యోగ కుటుంబాల మహిళలకు, స్థానిక, పరిసర ప్రభావిత ప్రాంత నిరుద్యోగ యువతి, యువకులకు 2002 సంవత్సరం నుండి వివిధ వృత్తి విద్యా శిక్షణ కోర్సులకు ఉచిత శిక్షణ కల్పించటం జరుగుతుందన్నారు. గతంలో సింగరేణి ద్వారా శిక్షణ పొందిన మహిళలు సొంతంగా యూనిట్లు పెట్టుకొని ఆర్దిక స్వాలంభన సాధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సింగరేణి భవన్ ప్రతినిధి శివకుమార్, హైదరాబాద్ ఖాదీ గ్రామోద్యోగ్ మహావిద్యాలయ్ ప్రతినిధి నరేశ్, ఇల్లందు లేడీస్ క్లబ్ సభ్యులు ఫ్యాని, లక్ష్మి , అస్సిస్టెంట్ స్పొర్ట్స్ సుపర్వైజర్ జాన్ వెస్లీ , సేవ సెక్రటరీ షాకీరా, సేవా కొ ఆర్డినేటర్ కేవి మారేశ్వరరావు, సేవా సభ్యులు, తదితరులు పాల్గోన్నారు.


