Badradrikothagudem

కొత్తగూడెం  రౌడీషీటర్స్ కు  కౌన్సిలింగ్

కొత్తగూడెం  రౌడీషీటర్స్ కు  కౌన్సిలింగ్.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించే లక్ష్యంతో,ప్రజా శాంతికి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సస్పెక్ట్స్ మరియు రౌడీషీటర్స్ కు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్స్,సస్పెక్ట్స్ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలకు ఇబ్బందులు ప్రవర్తిస్తూ,ప్రజాశాంతికి భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు.ప్రవర్తన మార్చుకోకుండా ఎవరైనా శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉన్నతాధికారుల ఆదేశాలతో పీడీయాక్టులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

నియమ నిబంధనలను పాటిస్తూ సత్ప్రవర్తనతో మెలుగుతున్న వారిపై ఉన్నతాధికారుల షీట్స్ ను తొలగించే విధంగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టూ టౌన్ సిఐ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *