జల శక్తి అభియాన్ కేంద్ర కమిటీ సభ్యుల సమీక్ష సమావేశం.
జల శక్తి అభియాన్ కేంద్ర కమిటీ సభ్యుల సమీక్ష సమావేశం.
కేంద్ర జల శక్తి అభియాన్ కమిటీ సభ్యులు ఇస్మాయిల్ ఖాన్ డిప్యూటీ సెక్రటరీ , శ్రీనివాస్ విటల్ గ్రౌండ్ వాటర్ టెక్నికల్ అధికారి జిల్లాలోని కొత్తగూడెం మండలం లో పర్యటించారు. ముందుగా కొత్తగూడెం మండలం త్రీ ఇంక్లైన్ బృహత్పల్లె ప్రకృతి వనం 10 ఎకరాల్లో నాటిన 36వేల మొక్కలు ను సందర్శించారు. అనంతరం త్రీ ఇంక్లైన్ గ్రామపంచాయతీ పరిధిలోని నీటి కుంట ను మరియు కృషి విద్యన్ లో పామాయిల్ , మునగ ప్లాంటేషన్ ను సందర్శించారు.
రుద్రంపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు నాటిన నర్సరీ నర్సరీ , స్కూల్ గార్డెన్ పరిశీలించారు. అనంతరం విద్యానగర్ గ్రామపంచాయతీ కార్యాలయం నందు నిర్మించిన ఇంకుడు గుంతను పరిశీలించారు.పాల్వంచ మండలం తో గూడెం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ను సందర్శించి వాటర్ ప్లాంట్ లో జలశుద్ధి ఏ విధంగా జరుగుతుంది, నీటి శుద్ధి పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు.
ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులు మరియు తీసుకున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. తిరిగి నవంబర్లో జిల్లా పర్యటనకు వస్తామని తెలిపారు.