సైబర్ నేరాల ఫై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలి.
సైబర్ నేరాల ఫై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలి.
మణుగూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మణుగూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీసు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి,పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. గంజాయి రవాణా,జూదం,మట్కా,గుట్కా లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.5S అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డులను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాలని తెలియజేసారు.వర్టికల్స్ వారీగా అధికారులు మరియు సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని తెలిపారు.అనంతరం అధికారులు మరియు సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,సీఐ సతీష్,ఎస్సైలు ప్రసాద్,రంజిత్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.