దేవర మూవీ సరికొత్త రికార్డ్స్
దేవర మూవీ సరికొత్త రికార్డ్స్.
ఈ ఏడాది సినిమాలలో పెద్ద సినిమాల సంఖ్య ఒకింత తక్కువనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం, కల్కి 2898 ఏడీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలై సక్సెస్ సాధించగా మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న పెద్ద సినిమా ఏదనే ప్రశ్నకు దేవర సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. దేవర సినిమాలో కథ, కథనం అద్భుతంగా ఉంటే మాత్రం ఈ సినిమా సంచలన రికార్డ్స్ ను సొంతం చేసుకోవడం పక్కా అని చెప్పవచ్చు.
దేవర మరో 50 రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ కూడా అదిరిపోయాయని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్ డేట్స్ ద్వారా అర్థమవుతోంది. తారక్, జాన్వీ కపూర్ జోడీ సూపర్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైతే మాత్రమే ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ లో నెలకొన్న సందేహాలకు చెక్ పెట్టే అవకాశం ఉంది.
దేవర మూవీ సరికొత్త రికార్డ్స్ తో బాక్సాఫీస్ ను షేర్క్ చేయనుందని ఫ్యాన్స్ నమ్మకం. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఈరోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఎన్టీఆర్ 32వ సినిమాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ ఒకింత స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం . రెండు భాగాలుగా దేవర మూవీ తెరకెక్కుతోంది.