లక్ష ఇరవై వేల ఎకరాలకు నీరు.
లక్ష ఇరవై వేల ఎకరాలకు నీరు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలను ఉపయోగించాలని ఉద్దేశంతో 2017 న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహించామని వ్యవసాయ, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొదటి ఐదు సంవత్సరాలు పని పనులు బాగానే నడిచిన తరువాతే ఐదు సంవత్సరాలు నత్త నడకన సాగాయని తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా కొత్తూరు, ఆర్కే రంగాపురం , పూసుకుడం మూడు పంప్ హౌస్ ల ద్వారా గోదావరి జలాలను 104 కిలోమీటర్ల వరకు తీసుకువెళ్ల గలిగాం అని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 9.8 కిలోమీటర్ల దగ్గర మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకం ద్వారా తుమ్మల చెరువుకి పనులు జరుగుతున్నాయని,దానికి కొంత భూసేకరణ మరియు కెనాల్ పనులు పూర్తి చేస్తే అక్కడ సుమారు 15,795 ఎకరాలకు అశ్వాపురం మండలంలో సాగులోకి వస్తుందని తెలిపారు.
74వ కిలోమీటర్ వద్ద 38 వేల ఎకరాల కు సాగునీరు దించే అవకాశం ఉందని, దీనికి కూడా భూసేకరణ పూర్తి చేస్తే ఈ సంవత్సరం వచ్చే సీజన్ కల్లా పూర్తి చేస్తే సాగులోకి వస్తుందని తెలిపారు. 74 కిలోమీటర్ల నుంచి 98వ కిలోమీటర్ వరకు రెండవ ప్యాకేజీ లో 34 వేల ఎకరాలు సాగులోకి వస్తుందని 380 కోట్లు ఖర్చు పెట్టాలని, దీనికిగాను త్వరగా భూసేకరణ మరియు టెండర్లు పూర్తి చేయడం ద్వారా పైభాగానికి సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు.
102 కిలోమీటర్ల వద్ద రాజీవ్ లింకు కెనాల్ ముఖ్యమంత్రి మరియు ఇరిగేషన్ మంత్రి తర్వాత మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అది కేవలం సాగర్ కు నీరు ఇబ్బంది వచ్చినప్పుడు గోదావరి జలాలను వాడుకోవడానికి ఉపయోగపడుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో లక్ష ఇరవై వేల ఎకరాల పైన మీడియం ప్రాజెక్ట్ లైన వైరా లంకసాగర్ నాగార్జునసాగర్ ఆయకట్టులకు నీరు ఇవ్వచ్చు అని మంత్రి తెలిపారు.