Andrapradesh

గ్రామ పంచాయతీలకు కొత్త జీవం పోసేందుకు కృతనిశ్చయం

గ్రామ పంచాయతీలకు కొత్త జీవం పోసేందుకు  కృతనిశ్చయం

13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడం, జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంపై పల్స్ సర్వే నిర్వహించడం, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు పెంచడం వంటి మూడు కీలక నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్ ప్రకటించారు.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, సర్పంచ్ వ్యవస్థను పునరుద్ధరించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ మూడు చర్యలను తక్షణమే అమలు చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం, గ్రామాల్లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామ పంచాయతీలకు కొత్త జీవం పోసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా విద్యుత్ డిస్కంలకు మళ్లించిందని ఆరోపించారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల కోసం పంచాయతీలు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనుగోలు చేయలేకపోయాయి. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల పరిస్థితి ఇలాగే ఉందన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *