జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.
జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.
ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, పర్యాటక శాఖ , ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తో కలిసి జిల్లాలో పర్యాటకశాఖ అభివృద్ధి చేయడంలో భాగంగా పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా ముందుగా మంత్రులు స్థానిక శాసనసభ్యులు అయినా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, సత్తుపల్లి శాసనసభ్యులు మట్ట రాగమయి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి కిన్నెరసాని ప్రాజెక్టులో బోటులో విహరించి కిన్నెరసాని అభయారణ్య ప్రాంతాన్ని, దీవులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కిన్నెరసాని ప్రాజెక్ట్ వివరాలు నీటి నిలువల గురించి ఉపముఖ్యమంత్రి మరియు పర్యట శాఖ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా అందరికీ భోజనాలు వడ్డించారు.