హృదయపూర్వక ఆశీస్సులు
హృదయపూర్వక ఆశీస్సులు
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కాబోయే వధూవరులు భార్గవ్-చిద్వితలకు హృదయపూర్వక ఆశీస్సులు అందజేశారు.మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య-మహాలక్మీల కుమారుడు భార్గవ్-చిద్వితల నిశ్చితార్థం రాత్రి హైదరాబాద్ దసపల్ల హోటల్ కన్వెన్షన్ హాలులో ఘనంగా జరిగింది.ఈ నిశ్చితార్థ వేడుకలకు ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి అక్షింతలు వేసి కాబోయే వధూవరులకు హృదయపూర్వక ఆశీస్సులు అందజేశారు.
మాజీ మంత్రులు కే.టీ.రామారావు, తన్నీరు హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్ కుమార్,పెద్ది సుదర్శన్ రెడ్డి,బాల్క సుమన్,బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి,మున్నూరుకాపు ప్రముఖులు ఆకుల రజిత్ తదితర ప్రముఖులు కాబోయే వధూవరులను ఆశీర్వదించి,వెంకటవీరయ్య-మహాలక్మీ,వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు.