కష్టపడితేనే భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో..
కష్టపడితేనే భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో..
విద్యార్థులకు సూచించిన మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి.
అశ్వారావుపేట: “పిల్లలూ.. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి?. మంచిగా చదువుకుంటున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మేము ఎవరో తెలుసు కదా…? చెప్పండి. మీ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తాం. బాగా చదువుకోండి మరి” అంటూ.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి విద్యార్థులతో అన్నారు.
అశ్వారావుపేట మండలం సున్నం బట్టి గ్రామంలో గల ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలను తనిఖీ చేశారు. ప్రాంగణమంతా కలియతిరిగి, వంటగది, విద్యార్థుల గదులు పరిశీలించారు. అనంతరం పిల్లలతో కాసేపు మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.మీ కలెక్టర్, ఎస్పీ సార్ మాదిరి ఉన్నతంగా నిలవాలి .మీకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాగా చదివి మీ కలెక్టర్ జితేష్ వీ.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ మాదిరిగా మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి సూచించారు.