Telangana

ప్రపంచ దేశాల్లో పేదరిక నిర్మూలన.

ప్రపంచ దేశాల్లో పేదరిక నిర్మూలన.

 బ్రాక్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి సీతక్క.

ప్రజా నాయకురాలు మంత్రి సీతక్క  రాష్ట్ర సచివాలయంలో అంతర్జాతీయ సంస్థ బ్రాక్ (BRAC) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… ప్రపంచ దేశాల్లో పేదరిక నిర్మూలన కోసం బ్రాక్ పని చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. మారు మూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో పనిచేస్తున్న బ్రాక్, తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు.

తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో బ్రాక్ అధ్యయనం చేసిన వివరాలను మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన తీరు ప్రశంసనీయమని అన్నారు.

వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామ పాలయాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క మరియు జూపాలి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు, అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు చేత ప్రసాదాలు అందజేశారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలోని మేడారంలోని సమ్మక్క సారలమ్మ ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రామప్ప లో పర్యాటకులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు రిజర్వాయర్ ను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ములుగు జిల్లాల్లో అందమైన అడవులు , పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, గోదావరి పరివాహక ప్రాంతాల చుట్టూ ఉన్న కట్టడాలను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *