BadradrikothagudemTelangana

ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి.

ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆటో డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని  జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  ఒక ప్రకటనను విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆటోడ్రైవర్లందరికీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలను జారీ చేశారు.పాల్వంచ,భద్రాచలం మరియు ఇల్లందు పట్టణాల్లోని ఆటో డ్రైవర్లకు  అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి పోలీసు అధికారులు పలు సూచనలను చేశారు.

ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ,రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.మద్యం సేవించి ఆటోలను నడపడం,నిర్లక్ష్యంగా రోడ్లపై ఇష్టానుసారంగా ఆటోలను నిలిపివేసి, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఆటో డ్రైవర్లందరూ క్రమశిక్షణ కలిగి ఉండి తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలను ఎల్లప్పుడూ తమతోనే ఉంచుకోని,పోలీసు వారి జరిమానాలకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.డ్రైవర్ సీటు వెనక భాగంలో డ్రైవర్ పేరు మరియు ఫోన్ నెంబరును ప్రయాణికులకు కనిపించే విధంగా కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *