BadradrikothagudemTelangana

  ఉపాధ్యాయులే  విద్యార్థులకు  జ్ఞానాన్ని అందించేది.

  ఉపాధ్యాయులే  విద్యార్థులకు  జ్ఞానాన్ని అందించేది.

విద్యార్థులకు కావలసిన జ్ఞానాన్ని అందించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను తయారుచేసి వారికి మంచి భవిష్యత్తును అందించడంలో ఉపాధ్యాయులకు కీలక పాత్ర పోషిస్తారని జిల్లా కలెక్టర్  జితేష్అన్నారు.

జిల్లాలో ఇటీవల పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో నిర్వహించనున్న శిక్షణా తరగతులను ప్రారంభిస్తూ…ముందుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతూ, ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన సామర్ధ్యాలు అందించడంలో విశేష కృషి చేశారని ప్రస్తుతం పదోన్నతి ద్వారా ఉన్నత పాఠశాలకు వెళ్లడం వల్ల అక్కడ పరిస్థితులు, పిల్లలు, బోధన విధానాలు, పరీక్ష విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఈ శిక్షణ ఎంత ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలుపరచడం ద్వారా మంచి భవిష్యత్తు తరాలని తయారు చేయాలని, కేవలం ఈ శిక్షణలోనే కాకుండా సీనియర్ ఉపాధ్యాయుల నుండి నిరంతరం విషయాలను తెలుసుకొని నాణ్యమైన బోధన్ అందించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీఎం వెంకటేశ్వర చారి మాట్లాడుతూ జిల్లాలో 680 మంది ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పదోన్నతి పండగ మొదటి విడతలో 130 మంది ఇంగ్లీష్ ఫిజిక్స్ మరియు సోషల్ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు శిక్షణ అందిస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకొని సందేహాలు అన్నిటిని నివృత్తి చేసుకొని పాఠశాలలో నాణ్యమైన బోధన అందించాలని నూతన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమానికి శిక్షణా సమన్వయకర్తగా జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగ రాజశేఖర్ వ్యవహరించగా, జిల్లాలో పై సబ్జెక్టులలో పదోన్నతి పొందిన 130 మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు 15 మంది డిఆర్పీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *