పదవి విరమణ పొందుతున్న జిఎం(సిఎంసి) కి సన్మానం
పదవి విరమణ పొందుతున్న జిఎం(సిఎంసి) కి సన్మానం
మణుగూరు, శోధన న్యూస్ : సింగరేణిలో సుదీర్ఘ కాలం పని చేసిన కార్పొరేట్ జిఎం(సిఎంసి) జి మోహన్ రెడ్డి కి ఈ నెలలో పదవి విరమణ పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాకు విచ్చేసిన సందర్భంగా శనివారం జనరల్ మేనేజర్ కా ర్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ చేతుల మీదుగా ఘన సన్మానం చేయడం జరిగింది.. సింగరేణి సంస్థలో విభిన్న హోదాలలో పని చేసి సంస్థకు వీరి సేవలు ఎంతగానో ఉపయోగ పడినాయని కొనియాడారు. 41 ఏళ్ల సర్వీసులో ఉద్యోగుల, అధికారుల, యాజమాన్య మన్ననలు పొందారన్నారు. రిటైర్మెంట్ తర్వాత శేష జీవితాన్ని సుఖసంతోషాలతో పాటు గడపాలన్నారు. అనంతరం మణుగూరు ఏరియాలో ఏరియా సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీ అబ్దుల్ షబ్బీరుద్దీన్కి ఆర్‌జి-3 ఏరియాకు బదిలీ పై వెళ్తున్న సందర్భంగా జనరల్ మేనేజర్దు ర్గం రామచందర్ చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో పికేఓసి ప్రాజెక్ట్ అధికారి టి లక్ష్మీపతి గౌడ్ , కేపియుజి ప్రాజెక్ట్ అధికారి వీరభద్ర రావు, ఎస్‌ఓ టు జిఎం డి శ్యామ్ సుందర్ , డిజిఎం(పర్సనల్) ఎస్ రమేశ్ , డిజిఎం( కేసిహెచ్‌పి) మధన్ నాయక్ , డిజిఎం( ఫైనాన్స్) ఎం అనురాధా, డిజిఎం(ఎస్‌ఎంఎస్ ప్లాంట్)నరసింహ స్వామి , ఏరియా సెక్యూరిటీ అధికారి అబ్దుల్ షబ్బీరుద్దీన్, ఇతర ఉన్నత అధికారులు, అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
