జాతీయ స్థాయి క్రీడలలో పథకాలు సాధించే విధంగా తోడ్పాటు
జాతీయ స్థాయి క్రీడలలో పథకాలు సాధించే విధంగా తోడ్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ క్రీడలలో పాల్గొంటున్న యువ క్రీడాకారుల ప్రతిభ పాటవాలు, నైపుణ్యాలు వెలికి తీసి వారికి నచ్చిన క్రీడలలో ప్రోత్సాహం అందించి జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొని పథకాలు సాధించే విధంగా తోడ్పాటు అందించడానికి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
ఆదివారం నాడు పాల్వంచ మినీ స్టేడియంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్, ఆర్చరీ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 29న మేజర్ ధ్యాన్చంద్ ఒలంపిక్ హాకీ క్రీడాకారుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ క్రీడలలో పాల్గొనే యువకులు మేజర్ ధ్యాన్చంద్ హాకీ క్రీడాకారుడిని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఏ క్రీడలలో అయితే పాల్గొంటారో తప్పనిసరిగా మీలోని ప్రతిభను, నైపుణ్యాలను వెలికి తీసుకొని పథకాలు సాధించాలని అన్నారు.
ప్రతిరోజు చదువుతోపాటు మీరు కోరుకున్న క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి తప్పనిసరిగా సాధన చేస్తూ ఉండాలని ,మీరు అనుకున్న లక్ష్యం సాధించేవరకు విశ్రమించకూడదని అన్నారు. క్రీడలలో గెలుపు ,ఓటములు సహజమని ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహ పడవద్దని, తప్పనిసరిగా గెలవడానికి యువకులు ప్రయత్నించాలని అన్నారు. ఆర్చరీ అథ్లెటిక్స్ లలో పాల్గొనే యువకులకు సంబంధిత కోచ్ లు పిల్లలు ఆడుతున్న విధానాన్ని గమనించి వారికి సలహాలు సూచనలు ఇచ్చి తప్పనిసరిగా ఆర్చరీ, అథ్లెటిక్స్ విభాగాలలో పిల్లలందరూ మొదటి స్థానంలో గెలుపొందడానికి వారిలో స్ఫూర్తి నింపాలని అన్నారు.