గవర్నర్ కి వన దేవతల ప్రతిమను బహూకరించిన మంత్రి సీతక్క
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా సాయంత్రం గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సుకు రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, టూరిజం ఎం.డి. ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్,ఎస్పీ శబరిష్ లతో కలిసి చేరుకున్నారు.
గవర్నర్ కి వన దేవతల ప్రతిమను బహూకరించిన మంత్రి సీతక్క
గవర్నర్ పర్యటనకు సంబంధించి అన్ని తానై స్వయంగా పర్యవేక్షించారు.ములుగు జిల్లాకు విచ్చేసిన గవర్నర్ పర్యటనను విజయవంతం చేయుటలో ప్రముఖ పాత్ర పోషించారు మంత్రి సీతక్క.గవర్నర్ కి జిల్లా అధికార యంత్రాంగం తో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్ పర్యటన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి అడవి బిడ్డ, సమ్మక్క సారలమ్మల వారసురాలు మంత్రి సీతక్క మేడారం వనదేవతల ప్రతిమను గవర్నర్‌కి బహుకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.