ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
ఖమ్మం: నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి నగరంలోని 18వ డివిజన్ లోని సీతారామ నగర్లో రూ. 135 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. నిర్మాణ పనులు నాణ్యత తో, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.