జిల్లాలో భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
జిల్లాలో భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 31-08-24 శనివారం నుండి బుధవారం04- 09 -24 వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ పంచాయతీ మరియు గ్రామ పరిధి లోని. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, సుదూర ప్రాంత ప్రయాణాలు చేయరాదని, ప్రజలు ప్రయాణించే మార్గంలో వాగులు వంకలు దాటరాదని, గ్రామీణ ప్రాంతంలోని మట్టి గోడల ఇల్లు, పాకలలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ కోరారు. జిల్లా అధికారులందరూ సమైక్యంగా పనిచేసే ఎటువంటి నష్టం కలగకుండా తమ వంతు బాధ్యతలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
జిల్లాకు నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. ఇందుకోసం ఐడిఓసి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ తో పాటు 24 గంటలు పర్యవేక్షణ నిమిత్తం సిబ్బందిని విధులు కేటాయించారు. కలెక్టరేట్ కార్యాలయంలో 08744-241950 నెంబర్ అందుబాటులో ఉంటుందని, నిరంతరం సమాచార నిమిత్తం 18 మంది సిబ్బందిని కేటాయించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సిబ్బంది శనివారం సాయంత్రం నుంచి నాలుగో తేదీ సాయంత్రం వరకు నిరంతరం అందుబాటులో సేవలందిస్తారని తెలిపారు.