పోలీస్ అధికారులను సన్మానించిన పోలీస్ కమిషనర్
పోలీస్ అధికారులను సన్మానించిన పోలీస్ కమిషనర్
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ శాఖ మన్ననలు పొందారని పోలీస్ కమిషనర్ కొనియాడారు.
రిటైర్ మెంట్ తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదని, మీ విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు
సిహెచ్.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ
కె. వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ
వి. రామారావు, ఏఎస్‌ఐ
డి.వి. నారాయణ, ఏఎస్‌ఐ
షేక్. బీజాపూర్ ఫరూక్, ఏఆర్ఎస్‌ఐ
టి. వెంకటేశ్వర్లు, హెచ్ సి
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు,ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్ ఐ కామరాజు , రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.