వైద్య సేవలతో ప్రజల్లో నమ్మకం పెంపొందించాలి
వైద్య సేవలతో ప్రజల్లో నమ్మకం పెంపొందించాలి
ఖమ్మం: మెరుగైన వైద్య సేవలతో ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతాశిశు ఆర్యోగ కేంద్రం ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటి, ఫార్మసీ, వార్డులు పరిశీలించారు. గర్బిణిలు, క్యాజువల్ వైద్య పరీక్షలకు వచ్చిన గర్బవతులు, రోగుల సహాయకులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డెలివరీ రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఇడిడి ల వివరాలు అడిగి, రెగ్యులర్ గా పర్యవేక్షణ చేస్తున్నది, లేనిది అడిగి తెలుసుకున్నారు. ల్యాబరేటరీ పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు.
డెలివరీలు పెంచాలని, గర్భిణులకు రెగ్యులర్ చెకప్ అయ్యేలా చూడాలని తెలిపారు. స్కానింగ్ కేంద్రాలను పరిశీలించి, ఎంతమంది టెక్నీషియన్లు ఉన్నది, ఎన్ని పరీక్షలు చేపడుతున్నది అడిగి తెలుసుకున్నారు. మామోగ్రఫి చేపడుతున్నది, ఎన్ని కేసులు చేసింది అడిగి తెలుసుకున్నారు. పరీక్షల రిజిష్టర్ కలెక్టర్ తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. రోజుకు సరాసరి పేషంట్ల వివరాలు, ఏ ఏ వైద్యసేవలు అందిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రకాల వైద్యపరీక్షలు, స్కానింగ్ లు ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని ప్రసవాలు చేస్తున్నది, ఇడిడి రిజిష్టర్ నిర్వహణ గురించి ఆరా తీసారు. సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించాలని, గర్భిణులకు ముందస్తుగా సాధారణ ప్రసవాలకు చేపట్టాల్సిన చర్యలపై చైతన్యం తేవాలన్నారు.