ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి.
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి.
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.
గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.
*జూలూరుపాడు మండలం మాచినపేట గ్రామానికి చెందిన బి.ప్రవీణ్ అమ్మానాన్నను చిన్నప్పుడే చనిపోయినందున ఇంటర్ వరకు చదువుకున్న తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. దరఖాస్తును పరిశీలించి జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కు ఎండార్స్ చేశారు.
*రుద్రంపూర్ కు చెందిన జోగు చంద్రావతి వికే -7 వల్ల తమ ఇల్లు కూల్చివేశారని, 100 గజాల స్థలం ఇచ్చారని, ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు పథకంలో అవకాశం కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ హౌసింగ్ శాఖకు ఎండార్స్ చేశారు.