బియ్యన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన నిందితుల
బియ్యన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన నిందితులు.
కొత్తగూడెం టూటౌన్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కొత్తగూడెం టూటౌన్ PS పరిధిలోని రామవరం ఏరియాలో నెహ్రూ బస్తీ లో పిడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు రామవరంలోని నెహ్రూ బస్తీ కి చెందిన SK.యాకూబ్ పాషా ఇంటి వద్ద ఏన్కూర్ మండలం, కేసుపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు పగడాల నరేష్,సిద్దల కాంతారావు,జెర్రిపోతుల హరీష్,మందనపు ఆదర్శ్, కేలోతు సక్రియ మరియు రామవరంకు చెందిన ఎస్కే యాకూబ్ పాషాలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఒక Ashok Leyland వెహికల్ ట్రాలీ మరియు ఒక బొలెరో వ్యాన్ మరియు Baleno కారుని స్వాధీనపరచుకోవడమైనది.57 క్వింటాళ్ల బరువు గల 114 పిడిఎస్ రైస్ బ్యాగులను స్వాదీనం చేసుకున్నారు.వాటి యొక్క విలువ సుమారుగా 1,48,200/-రూపాయలు ఉంటుంది.పీడియస్ బియ్యన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని కొత్తగూడెం 2టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ వివరాలను వెల్లడించారు.