డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల ప్రతిపాదనలను పంపించాలి
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల ప్రతిపాదనలను పంపించాలి
-మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్
మహబూబ్ నగర్, శోధనన్యూస్: ఈనెల 18 లోగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల ప్రతిపాదనలను పంపించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి రవి నాయక్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం అయన రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణ విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని స్థాయిలలో ఎన్నికల విధులకు నియమించబడిన అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని, స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో తయారుచేసి నేటిలోగా పంపించాలన్నారు .పోలింగ్ సిబ్బందికి అవసరమయ్యే వాహనాలతో పాటు ఆయా బృందాలకు అవసరమయ్యే వాహనాలను దృష్టిలో పెట్టుకుని వాహనాల ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఎన్నికలకు అవసరమైన సామాగ్రి కోసం ఎలాంటి సామాగ్రి కావాలో టెండర్ ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. నియోజకవర్గాల వారిగా కమ్యూనికేషన్ ప్రణాళికతో పాటు జిల్లా ఎన్నికల ప్రణాళికను రూపొందించాలని అన్నారు. ఫారం 12 డి ముద్రణకై ప్రింటింగ్ ప్రెస్ ల గుర్తింపు, అంగన్వాడీల ద్వారా ఓటర్లకు ఫారం-12 డిని పంపించాలని, వీటిని నిర్ధారణ చేసేందుకు సిడిపిఓ లను సూపర్వైజర్ అధికారులుగా నియమించాలని ఆదేశించారు. సువిధ, ఇతర యాప్ ల ద్వారా వివిధ రకాల అనుమతులు ఇచ్చేందుకు సంబంధిత యాప్ లను యాక్టివేట్ చేయాలని, పిఓలు ఏపీఓలు రాండమైజేషన్ కు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా నియమించిన వివిధ తనిఖీ బృందాలు సీజర్ పై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల శాతం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, అవగాహన కార్యక్రమాలను పెంపొందింపజేయాలని, జిల్లా విద్యాశాఖ అధికారి స్వీప్ నోడల్ అధికారిని ఆదేశించారు. మహబూబ్ నగర్ రిటర్న్ అధికారి,ఆర్ డి ఓ అనిల్ కుమార్ ,జడ్చర్ల రిటర్నింగ్ అధికారి,రెవెన్యూ అదనపు కలెక్టర్
ఎస్ మోహన్ రావు, దేవరకద్ర రిటర్నింగ్ అధికారి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, నోడల్ అధికారులు, ఏఈఆర్వోలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.