వరద ముంపు ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్న ఎంపీ
వరద ముంపు ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్న ఎంపీ
ఖమ్మం జిల్లా ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ సహాయక చర్యలను ముమ్మరo చేయిస్తున్నారు.రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబుతో కలిసి నగరంలోని కవిరాజ్ నగర్ లో ఇంటింటికీ తిరిగి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
వీధుల్లో, ఇళ్ల ఆవరణలో బురద పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలపగా.. వెంటనే అగ్నిమాపక శాఖ డీజీ వై. నాగిరెడ్డి తో ఫోన్లో మాట్లాడి ఫైరింజన్ల ద్వారా.. బురద తొలగింపు పనులు చేయించాలని సూచించారు. దీంతో వెనువెంటనే ఫైరింజన్లు అక్కడికి చేరుకోగా .. సిబ్బంది పనులు మొదలెట్టారు. జలగoనగర్, తదితర ప్రాంతాల్లో కూడా ఈ మేరకు బురద తొలగింపు కొనసాగుతోంది. ఆ తర్వాత కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో స్వయంగా మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుoడా సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే వరద ప్రభావం లేని ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య సిబ్బంది, చెత్త తరలింపు వాహనాలు, వాటర్ ట్యాoకులు రప్పించాలని ఆదేశించారు.