జనగామ జిల్లా కి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టాలి.
జనగామ జిల్లా కి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టాలి.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి.కృష్ణారావు.
ఖమ్మం,టౌన్ : బీసీ ,ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యం లో సాయుధ తెలంగాణ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వర్ధంతిని ఘనంగా జరిపారు.ఈ సందర్భంగా పాత కలెక్టర్ ఆఫీసు ముందు ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణా రావు మాట్లాడుతూ.. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నైజాం మరియు విస్నూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి కి వ్యతిరేకంగా అలుపెరగని ఉద్యమం చేసి వీరనారీమణిగా పేరు ప్రఖ్యాతలు పొందిన ధీశాలి అని ప్రస్తుతించారు.చిట్యాల ఐలమ్మ పెరిగిన జిల్లా అయిన జనగాం జిల్లాకి చిట్యాల ఐలమ్మ గా నామకరణం చేయాలన్నారు.భూస్వాములకు వ్యతిరేంగా పోరాడి10 లక్షల ఎకరాల భూమిని పే ప్రజలకి పంచిపెట్టిన అబల మన ఐలమ్మ. బహుజనులందరు ఐలమ్మ నీ స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాధికారం అనే అంతిమ లక్ష్యాన్ని సాధించాలన్నారు . ఈ కార్యక్రమంలో ధామల్ల సత్యనారాయణ ,గొట్టిముక్కల శ్రీనివాస్ ,కరుణాకర్ గౌడ్ ,జల్లిపల్లి సైదులు ,వెంకన్న,రాములు తదితరులు పాల్గొన్నారు.