తెలంగాణ వైతాళికుడు కాళోజి
తెలంగాణ వైతాళికుడు కాళోజి
చావు, పుట్టుకలు కాకుండా బ్రతుకునంతా తెలంగాణాకు ధారపోసిన వైతాళికుడు కాళోజి అని గ్రంధపాలకురాలు జి మణిమృధుల అన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ ఆవరణలో కాళోజీ నారాయణరావు 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు.
కాళోజీ తెలంగాణ ఉధ్యమాల ప్రతిధ్వని, రాజీకయ, సాంఘీక చైతన్యాల సమాహారం అని అన్నారు. నిజాం ధమననీతిని, నిరంకుశత్వాన్ని, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలాన్ని ఎత్తారని చెప్పారు. ఆయన రచనలు ప్రజలను చైతన్య పరిచాయని, అన్యాయాలు, అక్రమాలకు ఎదురుతిరిగే బాటను నేర్పించాయని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమ కారునిగా జాతికి ఎనలేని సేవలు చేశారని చెప్పారు. కాళోజి రచనలకు 1992లో దేశ రెండవ అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ దక్కిందని చెప్పారు. ఆయన పేరిట వరంగల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని, హన్మకొండలో కళాక్షేత్రాన్ని నిర్మించారని అన్నారు. కాళోజీ చూపిన మార్గాన నడుచుకోవడమే. ఆయనకిచ్చే నిజమైన నివాళి అని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.