వరద బాధితుల సహాయార్థం శ్రీ చైతన్య విద్యార్థుల చిరు సహాయం
ఖమ్మం వరద బాధితుల సహాయార్థం శ్రీ చైతన్య విద్యార్థుల చిరు సహాయం
ఖమ్మం, సెప్టెంబర్ 12, శోధన న్యూస్ : ఖమ్మం,మామిళ్లగూడెం శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ కు చెందిన ఐదవ తరగతి విద్యార్థులు కే.శివతేజ్ మరియు కే.లక్ష్మీ తేజస్వి వారి సొంత పొదుపు నుండి 3300 రూపాయలు ఖమ్మం మున్నేరు వరద బాధితులకు సహాయార్థం శ్రీ చైతన్య స్కూల్ మామిళ్లగూడెం బ్రాంచ్ ప్రిన్సిపల్ గారికి అందజేశారు.సామాజిక బాధ్యత కరుణ, దయా గుణాలు ప్రదర్శిస్తూ విద్యార్థులు చేసిన ఈ చర్యను స్కూల్ యాజమాన్యం సమర్ధిస్తూ విద్యార్థులను ప్రశంసించారు. ఇటువంటి సామాజిక సేవ కార్యక్రమాలు చేయటంలో శ్రీ చైతన్య పాఠశాల ఎల్లప్పుడూ ముందుంటుందని స్కూల్ యాజమాన్యం తెలియజేశారు.
శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు సమాజానికి ప్రయోజనకరంగా, సామాజిక బాధ్యత మరియు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులకు నైతిక విలువలు సామాజిక సేవ అటువంటి కార్యక్రమాలను నేర్పుటలో శ్రీ చైతన్య స్కూల్ టీచర్స్ పాత్ర ప్రధానంగా ఉందని యాజమాన్యం కొనియాడారు.