ఉద్యమకారుల చైతన్య యాత్ర ను జయప్రదం చేయండి
దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర ను జయప్రదం చేయండి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫారం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు
ఖమ్మం : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపుమేరకు ఖమ్మం నగరంలో జరిగిన సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫారం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫారం ఆధ్వర్యంలో తెలంగాణలో అన్ని జిల్లాల చైతన్య యాత్రలో భాగంగా హైదరాబాద్ ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో విజయవంతంగా ముగించుకొని దక్షిణ తెలంగాణ చైతన్య యాత్రలో భాగంగా ఈనెల 15 , 16 తేదీలలో జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా 15వ తారీకు మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి 250 చదరపు గజాల స్థలం , పెన్షన్ 25 వేల రూపాయలు , ఉద్యమకారుల గుర్తింపు కార్డు లు జారీ చేయడంతో పాటు ఉద్యమకాల సంక్షేమ బోర్డు కు పదివేల కోట్లు బడ్జెట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు . దీనితోపాటు ఈనెల 27వ తేదీన సికింద్రాబాద్ హరి హర కళ భవనంలో ఉద్యమకారులందరికీ సన్మానం మరియు గుర్తింపు కార్డులను జారీ చేయడం జరుగుతుందని కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ పాల్గొని ఈ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు .
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి బోయిన వరలక్ష్మి , రాష్ట్ర నాయకురాలు రాచమల్ల ఉమా యాదవ్ , పగడాల నరేందర్ , లింగన్న బోయిన సతీష్ , భూక్య రాంబాబు నాయక్ , పేల్లూరు విజయ్ కుమార్ , భట్టు రాజేంద్ర నాయక్ , కామని అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.