దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర
దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర .
ఖమ్మం :తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రారంభించిన 33 జిల్లాల చైతన్య యాత్రలో భాగంగా దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల యాత్ర బృందం ఖమ్మంకు చేరుకున్న సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమకారులు ఘన స్వాగతం పలికారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫారం చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ పాల్గొని మయూరి సెంటర్ అమరవీల స్థూపం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు . అనంతరం ఈనెల 27వ తేదీన సికింద్రాబాద్ హరి హర కళ భవనంలో జరిగే ఉద్యమకారుల సన్మాన కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు . ఉద్యమకారులందరికీ సన్మానం మరియు గుర్తింపు కార్డులను జారీ చేయడం జరుగుతుందని అన్నారు.కావున 33 జిల్లాల ఉద్యమకారులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి 250 చదరపు గజాల స్థలం , పెన్షన్ 25 వేల రూపాయలు , ఉద్యమకారుల గుర్తింపు కార్డు లు జారీ చేయడంతో పాటు ఉద్యమకాల సంక్షేమ బోర్డు కు పదివేల కోట్లు బడ్జెట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.